జగన్ బయటకొస్తాడు – సీఎం అవుతాడు

Share this News:
“జగన్ బాబు ఏ తప్పూ చేయలేదు. దేవుడే జగన్‌ బాబును బయటకు తెస్తాడు.. ఆయనే జగన్‌ను ముఖ్యమంత్రిని కూడా చే స్తాడు. పైవాడు అందరినీ, అన్నింటినీ గమనిస్తున్నాడు” అంటూ విజయమ్మ విభిన్నంగా ప్రచారం చేశారు. దేవుడు వద్ద న్యాయం అందాలంటే కాస్త ఆలస్యం అవుతుంది, అందాకా ప్రజలుఏ ధైర్యంగా ఉండాలి, జగన్ బాబు కోరుకునేది కూడా ఇదే అని విజయలక్ష్మి, ఆమె కుమార్తె షర్మిలా ప్రజలకు పిలుపునిచ్చారు. లేనికేసులు మోపి జగన్ బాబును కుట్రతో జైలులో వేసినందుకే తాము ప్రచారానికి రావాల్సలి వచ్చిందన్నారు. బుధవారం వారిద్దరూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఫ్యాక్షన్‌కు వేసినట్లే అన్నారు.
ఈసందర్భంగా ఇండియాటుడే రాసిన కథనాన్ని విజయమ్మ ప్రస్తావించారు. ఇండియా టుడే కథనం ప్రకారం జగన్ అరెస్ట్ సోనియా ఆదేశాలపైనే జరిగిందని, ఆమె చేతిలో సీబీఐ కీలుబొమ్మ కాదా..? అని ప్రశ్నించారు. సీఎం కిరణ్, ఏఐసీసీ నేత ఆజాద్, ఎంపీ చిరంజీవి, కేంద్రమంత్రి పురంధరేశ్వరి, పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ జగన్‌ను విమర్శిస్తున్న తీరును ప్రస్తావిస్తూ … ఇదా కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన వైఎస్ కుటుంబానికి ఇచ్చే మర్యాద అని దుయ్యబట్టారు.

 

Share this News:

Leave a comment

Your email address will not be published.

*