జగన్ కేసులో జేడీకి ట్విస్టు !

Share this News:

జగన్ పార్టీ, సాక్షి టీవీ కొత్త వివాదానికి తెరలేపారు. జగన్ అక్రమాస్తుల కేసులు దర్యాప్తు చేస్తున్న సీబీఐ జేడి లక్ష్మీనారాయణ తరచుగా చేస్తున్న కాల్ లిస్ట్ లను బయటపెట్టారు. ఆయన తరచుగా టీవీ9, ఆంధ్రజ్యోతి ఎండీ, పత్రిక ప్రతినిధులు, ఎన్ టీవీకి, వాసిరెడ్డి చంద్రబాల అనే మహిళకు తరచుగా ఫోన్ చేస్తున్నారని, ఏ పని మీద ఆయన పనిచేస్తున్నారని, ఎవరి ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది.

ఆయన టీవీ 9 ప్రతినిధితో 382 సార్లు, ఎన్ టీవీకి 150 సార్లు, ఆంధ్రజ్యోతికి 230 సార్లు, వాసిరెడ్డి చంద్రబాల అనే మహిళకు 328 సార్లు, ఆమె నుండి లక్ష్మీనారాయణకు 400 సార్లు ఫోన్ లు వెళ్లాయని, ఆంధ్రజ్యోతి, వాసిరెడ్డి చంద్రబాల, జేడీ లక్ష్మీనారాయణల మధ్య పలుమార్లు ఫోన్ సంభాషణలు జరగడంలో అంతర్యం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. జగన్ ను జైలులో లేదా జైలు బయట చంపేసే కుట్ర జరుగుతుందని, లక్ష్మీనారాయణ ఓ ఉద్యోగి మాత్రమేనని, ఆయన పరిధులు మీరి ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు అన్నారు.

వైఎస్ ను చంపారు, కొడుకును జైలుకు పంపారని ప్రజలు ప్రజాస్వామ్య పద్దతిలో తీర్పు చెప్పారని, 2014 ఎన్నికలకు జగన్ ను లేకుండా చేసే కుట్ర జరుగుతుందని అన్నారు. ఇన్ని రోజులు దర్యాప్తు సాగదీసే అవసరం ఏముందని, జగన్ బయటకు రాకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. సాయంత్రం 5 గంటల తరువాత కూడా జేడీ లక్ష్మీనారాయణ ఎందుకు పనిచేస్తారని, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకే పనిచేయాలని, ఆ తరువాత కూడా జగన్ కేసులో ఎందుకు ఉత్సాహం చూపుతున్నారని, రేపు జగన్ ముఖ్యమంత్రి అయితే మీరంతా ఆయన కిందే పనిచేయాలన్న విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*