విశ్వరూపం చూపించిన సాక్షి !

Share this News:

మన గురించి పరిచయం చేసుకోవడం మంచి లక్షణం. మన సామర్థ్యాలు చెప్పుకోవడం మార్కెటింగ్ లక్షణం. మన గొప్పలు చెప్పుకోవడం కాస్త ఓవరాక్షన్. మనం చేసిన ప్రతిదీ గొప్పగా చెప్పుకోవడం…. అదో పేరు లేని పరాకాష్టకు చేరిన సొంత డబ్బా. ఈరోజు సాక్షి ఫ్యామిలీ పేజీ చూసిన ఎవరికైనా ఇదే స్ఫురిస్తుంది. తొలి నాళ్లలో సాక్షి ఫ్యామిలీలో మన ఫ్యామిలీకి పనికొచ్చే మంచి విషయాలు రాస్తారని ఆనందించాం. సాక్షికి ఎన్ని రాజకీయ లక్షణాలున్నా ఫ్యామిలీ వరకు దాన్ని రానివ్వకుండా చూసుకోగలిగారు. పెద్దాయన పోయాడు. జగనన్న వచ్చాక ఇక మొదలైంది తంతు. పెద్దాయన జ్ఞాపకాలంటూ కొన్ని రోజులు, జగన్ మైలు రాళ్లని కొన్ని రోజులు… రాసుకుంటూ వచ్చిన సాక్షి ఇప్పుడు ఫ్యామిలీని సొంత ఫ్యామిలీతో నింపేసింది. ఈరోజు అది సాక్షి ఫ్యామిలీ కాదు, వైఎస్ ఫ్యామిలీ. ఎంత కుటుంబాన్ని అభిమానిస్తే మాత్రం అవసరం ఉన్న చోట, లేని చోట ఇలా రాసుకోవడం మంచి కంటే చేటెక్కువ చేస్తుంది. ఎందుకంటే సాక్షిని ఎంత తిట్టినా ఫ్యామిలీని అక్కున చేర్చుకున్న వారు ఇతర పార్టీల్లోనూ ఉన్నారు. ఇలాంటి చర్యలతో సాక్షి అలాంటి పాఠకులకు దూరం కాక తప్పదు. షర్మిల పాదయాత్ర సందర్భంగా మునుపెన్నడూ లేనంతగా ఆ కుటుంబం ఫ్యామిలీ ఫొటోతో ఈరోజు సాక్షి ఫ్యామిలీ నిండిపోయింది. వైఎస్ దంపతులు, వారి కొడుకు-కోడలు, కూతురు…. అందరూ పేజీ మీదకు ఎక్కేశారు. బహుశా మీడియా చరిత్రలో ఇదో కొ(చె)త్త మైలురాయి.

 

Share this News:

Leave a comment

Your email address will not be published.

*