పాదయాత్ర ఆపేస్తా.. షర్మిల బెదిరింపు !

Share this News:

‘మరో  ప్రజా ప్రస్థానం’ పేరుతో జగన్ పార్టీని జనంలో నిలబెడుతున్న చెల్లెలు షర్మిల పాదయాత్రకు ముందే తన రాజకీయ భవిష్యత్ కు సంబంధించి కుటుంబంతో ఒప్పందం చేసుకుందా ? ఆ న ఒప్పందం మేరకే పాదయాత్రకు శ్రీకారం చుట్టిందా ?  తాజాగా ఈ వ్యవహారం వైఎస్ కుటుంబంలో వివాదం రేపినట్లు తెలుస్తోంది. జగన్ అరెస్టు తరువాత జనంలోకి వచ్చిన షర్మిలకు ప్రజల నుండి అనూహ్య మద్దతు రావడంతో ఆమె మనసు రాజకీయాల మీదకు మళ్లిందని తెలుస్తోంది. ఇక కీలక సమయంలో జగన్ జైల్లో ఉండడంతో ఉప ఎన్నికల్లో అభ్యర్థుల తరపున ప్రచారం చేయడం వల్ల షర్మిలకు అవగాహన ఇంకాస్త పెరిగింది. ఇక ఆ తర్వాత పలు సందర్భాల్లో మీడియా ముందుకు వచ్చారు. చిన్నప్పటి నుంచి కాస్త రెబల్ అయిన షర్మిల ఈ పరిణామాలతో రాజకీయాలపై ఆసక్తి పెంచుకుంది. అదేసమయంలో చంద్రబాబు పాదయాత్ర మొదలుపెట్టడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉండాల్సిన అవసరం ఏర్పడటంతో షర్మిల తప్ప వేరే దారి కనిపించలేదు. దీంతో తన ప్రాధాన్యం ఏంటో ఆమెకు స్పష్టంగా అర్థమైంది.  అందుకే మరో ప్రజా ప్రస్థానం యాత్రను ప్రారంభించారు. దీంతో ఆమె తన భవిష్యత్ కు సంబంధించి స్పష్టమయిన హామీ తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా కడప పార్లమెంటు స్థానానికి జగన్ చిన్నాన్న వైఎస్ భాస్కర్ రెడ్డి కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డి తెరమీదకు వచ్చారు. ఆయన ప్రజల్లోకి వెళ్లేందుకు బద్వేలు నుండి పాదయాత్రకు సిద్దపడ్డారు. అయితే ఆయన పాదయాత్ర చేస్తే నేను నిలిపేస్తానని షర్మిల హెచ్చరించడంతో అవినాష్ పాదయాత్ర రద్దయినట్లు తెలుస్తోంది. వైఎస్ మరణం తరువాత వైఎస్ వివేకానందరెడ్డి వైఎస్ కు దూరమై కుటుంబంలో వివాదాలు రేగాయి. తరువాతి పరిణామాలలో ఆయన మళ్లీ జగన్ వైపు వచ్చారు. తాజాగా ఈ వివాదం మళ్లీ వైఎస్ కుటుంబంలో చిచ్చు రేపిందని భావించవచ్చు.

ఎప్పటినుండో అవినాష్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నారు. గతంలోనే జగన్ ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 15 రోజుల క్రితం జగన్ ను జైలులో కలిసిన తరువాతనే తన పాదయాత్రకు అవినాష్ ఏర్పాట్లు చేసుకున్నారు. అన్ని నియోజకవర్గాలకు ఫ్లెక్సీలు, భోజన ఏర్పాట్లు మాట్లాడుకున్నారు. చివరి నిమిషంలో షర్మిల పాదయాత్రకు అడ్డుపడింది. మరి జైల్లో ఉన్న జగన్ తీసుకునే నిర్ణయం మీదనే అవినాష్ భవిష్యత్ ఆధారపడి ఉంది.

మొత్తానికి అప్పుడే ప్యాలెస్ పాలిటిక్స్ మొదలయ్యాయన్నా మాట!!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*