ఆ పేపర్, ఛానల్ నా వెంట్రుకతో సమానం

Share this News:

‘నాయక్’ ఆడియో విడుదల వేదికపై మెగాస్టార్ కుమారుడు రాంచరణ్ తేజ రెచ్చిపోయాడు. ”రచ్చ’ ఆడియో ఫంక్షన్ కు బాబాయ్ పవన్ కళ్యాణ్ రాలేదని ఓ పత్రిక, ఓ ఛానల్ చిలవలు, పలవలుగా వార్తలు రాసి మా కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు పలు కథనాలు అల్లారు. ఇప్పుడు ఈ ఫంక్షన్ కు బాబాయ్ వచ్చాడు. నాన్న రాలేకపోయాడు. ఈ వేదిక మీద నాన్న లేని లోటును బాబాయ్ తీర్చాడు. నా తరువాతి ఫంక్షన్ కు బాబాయ్ రాకపోవచ్చు. మా అనుబంధాల గురించి అడ్డగోలుగా రాసే ఆ పేపర్, ఛానల్ వార్తలు నా వెంట్రుకతో సమానం” రాంచరణ్ తేజ అన్నారు.

రాంచరణ్ వ్యాఖ్యలతో కార్యక్రమ ప్రాంగణం వేడెక్కింది. కార్యక్రమాలకు హాజరుకాకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అంతమాత్రాన ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తారా ? అని ప్రశ్నించాడు. అయితే మోతాదుకు మించి రాంచరణ్ మాట్లాడటం కార్యక్రమంలో చర్చానీయాంశంగా మారింది. గతంలో పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి కుమార్తె నిశ్చితార్ధం సంధర్భంగా మీడియా మీద విరుచుకుపడ్డాడు. వారిపై దాడి చేశాడు. ఈ వ్యవహారం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఇప్పుడు రాంచరణ్ విమర్శ కూడా హద్దులు దాటినట్లు అనిపిస్తుంది.

 

## please express your opinion on ramcharan speech through POLL # see bottom of the homepage # you can see video of the speech

Share this News:

Leave a comment

Your email address will not be published.

*