గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు !

Share this News:

“రైతాంగానికి భారంగా పరిణమించిన రుణాలను మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ”వస్తున్నా మీకోసం” పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆయన ప్రమాణ స్వీకారం తరువాత తొలి సంతకం రుణమాఫీ పైలు మీద చేశారు.”

అదేంటి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఏంటి అనుకుంటున్నారా ? అయితే ఓ సారి గుడివాడ వెళ్లండి. చంద్రబాబు నాయుడు పాదయాత్ర నేపథ్యంలో గుడివాడలో ఆయన అభిమానులు ఆయన ముఖ్యమంత్రి అయినట్లు,  కుర్చీ మీద కూర్చున్నట్లు …రుణ మాఫీ ప్రకటించినట్లు..తొలిసంతకం ఆ ఫైలు మీద పెట్టినట్లు ఫ్లెక్సీలు తయారు చేసి కట్టేశారు. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబేనని అభిమానులు చెబుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఇవన్నీ ఖాయం అని అంటున్నారు. మరి ఫ్లెక్సీలు చూశాక బాబు గారు ఏమంటారో ?

 

Share this News:

Leave a comment

Your email address will not be published.

*