డిగ్గీ ఆఫర్ తో కారుకు డ్యామేజ్

Share this News:

digvijay offer to trs

కాంగ్రెస్ ను డ్యామేజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న కారుకు పంక్చర్ పడేలా హస్తం పావులు కదపటం టీఆర్ ఎస్ నేతలకు నిద్ర పట్టటం లేదు. తెలంగాణ ఇస్తున్న తమకు సహకరించాలని.. సీమాంధ్ర నేతల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిళ్లను సైతం ఎదుర్కొని.. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు తాము పడుతున్న కష్టాన్ని గుర్తించాలంటూ డిగ్గీరాజా ఉద్యమ నేతలతో అనటమే కాదు.. టీఆర్ఎస్ పార్టీ నుంచి తమ పార్టీలోకి వచ్చే వారు ఎంత మంది ఉంటారనే విషయంపై వాకబు చేయటం టీఆర్ఎస్ అధినేతలో గుబులు పుట్టిస్తోందని చెబుతున్నారు.

తెలంగాణ ఇస్తే పార్టీని కలిపేస్తానని చెప్పినా.. తర్వాత లాభనష్టాల లెక్కల్లో పార్టీని కాంగ్రెస్ లో కలపకపోవటమే మంచిదన్న భావనకు కేసీఆర్ వచ్చారు. మరి మాట ఇచ్చారు కదా అంటే.. కాంగ్రెస్ ఇచ్చిన మాటల్లో ఎన్ని నిలబెట్టుకుందంటూ ఆయన రివర్స్ గేర్ వేస్తుండటంతో.. కారుకు పంక్చర్ చేస్తే తప్ప కాంగ్రెస్ కు కలిసిరాదన్న లెక్కలోకి హస్తం అధినేతలు వచ్చేశారు.

తమ వ్యూహంలో భాగంగా పదవుల ఆఫర్ తో గులాబీనాథుల్ని టెంప్ట్ చేయటం.. అదే సమయంలో టీ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారిని కాంగ్రెస్ లో కలుపుకోవటం ద్వారా కారును బోల్తా కొట్టించాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచిస్తుంది.

‘‘మీరు ఏం కోరుకుంటున్నారు. మీరంతా ఉద్యమంలో చాలా కష్టపడ్డారు. పార్టీలోకి వస్తే మీరు పడిన కష్టానికి ఫలితం దక్కుతుంది’’ అని చెప్పటంతో ఉద్యమ నేతలు ఎగిరి గంతేస్తున్నారు. దాంతో పాటు.. మీకు ఎక్కడి టిక్కెట్టు కావాలో కోరుకోండంటూ ఓపెన్ ఆఫర్ ఇవ్వటంతో ఉద్యమ నేతలు ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయిందని చెబుతున్నారు. ఇదే ఊపులో.. మరిన్ని ఆఫర్లతో టీఆర్ఎస్ నేతల ముందుకెళ్లితే.. కారుకు డ్యామేజ్ చేయటం పెద్ద కష్టమేమీ కాదని వారు భావిస్తున్నారు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*