జగన్ గూటికి యర్రం

Share this News:

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉంటే ఎలాగూ తాము గెలవం అని నిర్ణయించుకుని తమ భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకుంటున్నారు. ఇప్పటికే సీమాంధ్రకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు జగన్ పార్టీలోకి వెళ్లిపోయారు.

ఇప్పుడు తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన ఈ ఊహాగానాలను బలపరుస్తూ జగన్ తో కలిసి ఉన్న ఫోటోలతో పట్టణంలో ఫ్లెక్సీలు పెట్టారు. వీటి గురించి ఆయన ఇంతవరకు స్పందించడం లేదు. దీనిని బట్టి ఆయన చేరిక ఖాయం అని చెబుతున్నారు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*