తానొక్కడే రాజకీయం చేయాలంటున్న జగన్!

Share this News:

సమైక్య ముసుగులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్ మోహన్jagan 2  రెడ్డి విమర్శిస్తున్నాడు. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి తీరుపై విరుచుకుపడ్డాడు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని అసెంబ్లీలో తీర్మానం చేద్దామని అంటే ముఖ్యమంత్రి తమ మాట వినలేదని జగన్ రెడ్డి ఆరోపించాడు.

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విభజనకు అడ్డగోలుగా లేఖ ఇచ్చారని చెప్పారు. సమైక్య లేఖ ఇవ్వడానికి ఆయన ఇప్పటి వరకు ముందుకు రాలేదన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, సిఎం కిరణ్, చంద్రబాబు ముగ్గురూ కుమ్మక్కై రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నారన్నాడు. ఢిల్లీ అహంకారానికి, తెలుగు ప్రజల ఆత్మగౌరవం మధ్య నేడు యుద్ధం జరుగుతోందని జగన్ అన్నాడు. వచ్చే ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలు గెలుచుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వ్యక్తినే ప్రధానిని చేద్దాం అని జగన్ వ్యాఖ్యానించాడు.
మరి ముఖ్యమంత్రి రాజకీయాలే చేస్తుండవచ్చు గాక… ఆ రాజకీయాల గురించి జగన్ ఏ విధంగా ప్రశ్నిస్తాడు? రాష్ట్ర విభజన అంశం గురించి జగన్ తో సహా ఎవరికి తోచిన రాజకీయాలు వారు చేస్తూనే ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో జగన్ ప్రత్యేకంగా ముఖ్యమంత్రిని విమర్శించాల్సిన అవసరం లేదు. ఎవరికి వీలైనంత రాజకీయం వారు చేసుకొంటూ పోవడమే కదా రాజకీయం!

 

Share this News:

Leave a comment

Your email address will not be published.

*