మాజీ మంత్రి బ్యాంకు బ్యాలెన్స్ Rs.574

Share this News:

ఇది ఎక్కడైనా విన్నారా? వింటూనే ఉంటారు. కానీ నమ్మడమే కష్టం. కాకపోతే ఇవన్నీ టెక్నికల్ నిజాలు. వైఎస్ హయాంలో మంత్రిగా పని చేసిన మారెప్ప తన బ్యాంకు బ్యాలెన్సు కేవలం 574 రూపాయలు అని చెప్పారు. నేను అక్రమాలు చేయలేదు కాబట్టి నా దగ్గర డబ్బులు పోగుపడి లేవు… అక్రమాలు చేయడానికే నాన్న పదవి ఉందని భావించిన జగన్ ఆస్తులు ఇలా ధైర్యంగా బయటకు చెప్పగలడా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ కోసం ఎంతో కష్టపడ్డానని, నేను టిక్కెట్ ఆశించిన మాట నిజమే గాని… టిక్కెట్ ఇవ్వకపోతే పోనీ, ఆ పార్టీలో గౌరవ మర్యాదలు కూడా దక్కవన్నారు. అది మర్యాదలు తెలియని పార్టీ అని ఆయన ఆరోపించారు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*