ఉభయసభలు ..అదే గందరగోళం

Share this News:

పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభ ప్రారంభం కాగానే సభలో సీమాంధ్ర నేతలు సమైక్యనినాదాలు చేస్తూ సభను అడ్డుకుంటున్నారు. లోక్‌సభలో సభ ప్రారంభం parliament of indiaకాగానే స్పీకర్ మీరాకుమార్ పశ్చిమబెంగాళ్‌లో ప్రమాదంలో మరణించిన వారికి నివాళులర్పిస్తూ తీర్మానం చదివారు.  ఆ తరువాత సభ మొదలుకాగానే సీమాంధ్ర నేతలు సమైక్య నినాదాలతో హోరెత్తించారు. స్పీకర్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినకపోవడంతో సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.

రాజ్యసభలో సభ్యుల నినాదాలో చైర్మన్ పది నిమిషాలు వాయిదా వేశారు. ఆ తరువాత మరో సారి సభ మొదలుకాగానే మళ్లీ నినాదాలతో సభను అడ్డుకోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మొత్తానికి సభలు రెండూ ఈ రోజు కూడా కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*