కాంగ్రెస్ గేమ్ ప్లాన్ లో ఓడిపోయానంటున్న బాబు

Share this News:

“రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలని నేను తీవ్రంగా కృషి చేశాను. రాష్ట్ర విభజన విషయంలో అన్ని పార్టీలు నాటకాలు ఆడాయి. లోక్ సభలో ప్రత్యక్ష్య ప్రసారాలు నిలిపివేసిన దానిchandrababu naiduకి నేను ప్రత్యక్ష్య సాక్షిని. నేను లోక్ సభకు 2.45 గంటలకు వెళ్లాను. సభ వాయిదా పడింది అనడంతో అద్వానీ కార్యాలయానికి వెళ్లాను. ఆ తరువాత నాకు మెసేజ్ వచ్చింది. సభ నడుస్తుంది కానీ ప్రత్యక్ష్య ప్రసారాలు నిలిపేశారు. అద్వానీ వెంటనే అన్నారు ఇది ఎమర్జన్సీ కంటే ఎక్కువగా చేస్తున్నారు” అని అన్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా కాంగ్రెస్ అధిష్టానం స్క్రిప్టు ప్రకారం నడుస్తుందని ఆయన ఆరోపించారు.

రాష్ట్రానికి పంపిన తెలంగాణ బిల్లు డ్రాఫ్టు బిల్లు అని చెప్పారని, కానీ అదే వాస్తవ బిల్లు అని చెప్పలేదని, ఢిల్లీలోని పార్టీల నేతలకు తాను ఈ విషయం చెప్పానని, చెన్నై, ముంబయి, బెంగుళూరు అన్ని ప్రాంతాలు తిరిగి అన్ని పార్టీల నేతలకు కాంగ్రెస్ మోసం వివరించానని, అయితే కాంగ్రెస్ పార్టీ గేమ్ ప్లాన్ లో విజయం సాధించలేకపోయానని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ తో, సీమాంధ్రలో జగన్ తో ఒప్పందాలు చేసుకుని కాంగ్రెస్ ముందుకు వెళ్తుందని, ఇప్పుడు కిరణ్ ను కూడా ముందుకు తోస్తోందని ఆయన అన్నారు. దేశ సమైక్యతకు భంగంకలగకుండా ఉండేందుకు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని, రాష్ట్ర విభజన అనేది జాతీయ సమస్య అని ఆయన అన్నారు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*