పన్ను మినహాయింపు : సీమాంధ్రకు వరం

Share this News:

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ఆగ్రహాన్ని చల్లార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్యలు మొదలు పెట్టింది. సీమాంధ్రకు పన్ను మినహాయింపులు ఇవ్వడం సీమాంధ్రseemandhraకు గొప్ప వరంగా మారబోతుంది. ఇది భవిష్యత్ లో తెలంగాణకు, తమిళనాడుకు ఇబ్బంది కలిగించే అంశమే. తెలంగాణ విభజన మీద సీమాంధ్రలో కాంగ్రెస్ కు తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తూనే, సీమాంధ్రకు పన్ను మినహాయింపులు ఇవ్వడం సీమాంధ్రలో పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివచ్చేందుకు, సీమాంధ్ర యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పన్ను మినహాయింపుల మూలంగా తమిళనాడు సమీపంలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో, తీర ప్రాంతాల వెంట పరిశ్రమలు పెడితే ఆ పరిశ్రమలకు భారీ ఎత్తున పన్ను మినహాయింపు లభిస్తుంది. తమిళనాడులో ఉన్న పరిశ్రమలు, దేశంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న ప్రముఖ పరిశ్రమలు పన్ను మినహాయింపు ఉన్న ప్రాంతానికి తరలి వెళ్లిపోతాయి. కేంద్రం పన్ను మినహాయింపుల గురించి తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దీని మీద ఇప్పటికే పలువురు ఐఏఎస్ లతో సమీక్ష చేసి సీమాంధ్ర పన్ను మినహాయింపు మూలంగా తమిళనాడు నుండి పరిశ్రమలు తరలిపోకుండా ఏం చేయాలా ? అని నష్టనివారణ చర్యలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. పన్ను మినహాయింపు మూలంగా సీమాంధ్రకు భారీగా లాభం చేకూర్చుతుందని చెప్పవచ్చు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*