బయటపడ్డ ‘మెగా’ విభేధాలు

Share this News:

చాలా రోజుల తరువాత మెగాస్టార్ కుటుంబం అంతా ఓ చోట కలిసింది. ఆ మధ్య పలుమార్లు రామ్ చరణ్ తేజ సినిమా కార్యక్రమాలలో, ఆ తరువాత ఓ సారి అల్లు అర్జున్ సినిమా కార్యక్రమంలో, ఆ తరువాత చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సినిమా కార్యక్రమంలో మెగా కుటుంబం కలుస్తుందని భావించారు. కానీ ఎట్టకేలకు చిరు సోదరుడు నాగబాబు సినిమా కార్యక్రమంలో చిరు కుటుంబం అంతా కలిసింది. ఇక పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు అంతా కలిసి ఒకే చోట చూస్తామని అనుకున్నారు. భారీ ఎత్తున అభిమానులు కూడా హాజరయ్యారు.

కానీ ఇక్కడ చిరంజీవి, పవన్ కళ్యాన్ ల మధ్య విబేధాలు బయటపడ్డాయి. నాగబాబు అందరినీ ఒకచోట చేర్చినా వారి మనసులను కలపలేకపోయారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ – చిరంజీవిలు కనీసం పలకరించుకోలేదు. కార్యక్రమం మధ్యలోనే పవన్ కళ్యాణ్ అక్కడి నుండి వెళ్లిపోయారు. చిరంజీవి పవన్ ఏడి అనే సమయానికి అక్కడ అసలు ఆయన కనిపించనే లేదు. ప్రజారాజ్యం పార్టీ విలీనం అప్పటి నుండి ఇద్దరి మధ్య విభేదాలున్నాయని వస్తున్న ఊహాగానాలకు ఇది బలం చేకూర్చింది.

 

Share this News:

Leave a comment

Your email address will not be published.

*