20 ఏళ్లయినా తెలంగాణ వచ్చేది కాదు

Share this News:

jana reddyకేసీఆర్ 20 ఏళ్లు ఉద్యమించినా తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అందరి పాత్రా ఉంది. అయితే అందరికంటే మా కాంగ్రెస్ నేతల పాత్రనే అధికం. తాము ఉద్యమించకుంటే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదు. కాంగ్రెస్ పార్టీ అనుకుంది కాబట్టే తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో గెలిపించి సోనియాగాంధీకి కానుకగా ఇవ్వాలని మాజీ మంత్రి జానారెడ్డి పిలుపు నిచ్చారు. కేవలం ఇద్దరు ఎంపీలున్న పార్టీకి తెలంగాణ తేవడం ఎలా సాధ్యం అవుతుంది ? అని టీఆర్ఎస్ ను ఉద్దేశించి ఆయన అన్నారు.

తెలంగాణ పునర్నిర్మాణం, సామాజిక తెలంగాణ కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, టీఆర్ఎస్ తో విలీనమా ? పొత్తా ? అన్నది మాకు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని ..ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ అధిష్టానానికి ఓ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని, అధికారంలోకి ఖచ్చితంగా వస్తుందని అన్నారు. తెలంగాణకు చెందిన మాజీ మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఈ రోజు జానారెడ్డి ఇంట్లో సమావేశం అయ్యారు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*