నాగబాబు స్వామి భక్తి

Share this News:

మాకు గానీ ..మా కుటుంబానికి గానీ ..అందరికీ ఈ సమాజంలో ఓ గుర్తింపు అంటూ వచ్చింది అంటే అది కేవలం చిరంజీవి మూలంగానే ..చిరంజీవి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఓ గొప్ప రాజమార్గాన్ని తయారు చేశారు. తమ్ముళ్లతో పాటు నాకు ..అభిమానులకు అందరికీ ఓ గుర్తింపు తీసుకు వచ్చారు అని చిరంజీవి సోదరుడు నాగబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ వస్తుందన్న నేపథ్యంలో ఆయన తాను మాత్రం చిరంజీవి వెంటనే ఉంటామని, పవన్ కళ్యాణ్ కు ఎలాంటి మద్దతు ఉండబోదని ప్రకటించారు.

నా మద్దతుతో పాటు మెగా అభిమానుల అందరి మద్దతు చిరంజీవికేనని, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడాన్ని అభిమానులు ఎవరూ స్వాగతించడం లేదని తేల్చిచెప్పారు. ఆరెంజ్ సినిమా మూలంగా వచ్చిన నష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న నాగబాబును ఆదుకున్నది పవన్ కళ్యాణ్ అని, ఆ సమయంలో చిరు నాగబాబును పట్టించుకోలేదని ఫిల్మ్ నగర్ లో ఊహాగానాలు వినిపించాయి. కానీ నాగబాబు ఇప్పుడు చిరు పక్షాననే ఉండడం ..మెగా కుటుంబంలో ఎవరూ పవన్ పక్కన ఉండకపోవడం గమనించాల్సిన విషయమే.

 

Share this News:

Leave a comment

Your email address will not be published.

*