ఆ రహస్యం తరువాత చెబుతానంటున్నాడు

Share this News:

“సోనియాగాంధీ తెలంగాణకు అనుకూలంగా మారడంలో నేను నిర్ణయాత్మకమయిన పాత్ర పోషించా. నేను ఏం చేశానో చెప్పాలంటే కొన్ని రహస్యాలు వివరించాలి. వాటిని గోప్యంగా ఉంచడమే రాజ్యధర్మం. ఆ మర్యాదను ఉల్లఘించకూడదు. ఎన్నికలయిన తరువాత దానిని తీరిగ్గా చెబుతాను. దానిని ఇప్పుడే బయటపెడితే నా ప్రయోజనాలు కూడా నాకున్నాయి” అని కేంద్రమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి అన్నారు.

అసలు సోనియాగాంధీ తెలంగాణకు మొదట ఒప్పుకోలేదని, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు అంగీకరించాయని, బీజేపీ పార్టీ బిల్లు పెడితే మద్దతు ఇస్తామని చెప్పడంతో సోనియా తెలంగాణకు ఒప్పుకుందని జైపాల్ రెడ్డి అన్నారు. ఆ తరువాత ఈ పార్టీలన్నీ వెనకడుగు వేయడంతో ఆమె ధైర్యంగా ముందుకు వేసిన అడుగు వెనక్కు వేయలేదని అన్నారు. ఈ విషయాలు అన్నీ అందరికీ తెలిసినవే. మరి జైపాల్ రెడ్డి ఆ రహస్యం ఏంటో ? ఎప్పుడు బయటపెడతారో ?

Share this News:

Leave a comment

Your email address will not be published.

*