పొన్నాలా ..నాలుక చీరేస్తా !

Share this News:

“నా ఆస్తుల మీద విచారణ జరిపిస్తామని అంటున్నారు. మీ సవాల్ కు నేను రెఢీ. మీ ప్రభుత్వమే ఉంది కదా. మీకు దమ్ముంటే విచారణ జరిపించండి. పొన్నాల లక్ష్మయ్యనే విచారణ చేసుకోవచ్చు. నిజంగా నా తప్పుంటె మీరు నన్ను బతకనిస్తరా ? ఎప్పుడో జైళ్ల పెడ్తుంటిరి. అంతేకాని పిచ్చి పిచ్చి కూతలు కూస్తె నాలుక చీరేస్తా” అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను హెచ్చరించారు. తన ఆస్తుల మీద వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్దమని ప్రకటించారు.

తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ నేతలు అంటున్నరు. ఇవ్వడానికి బిస్కెట్ ప్యాకెట్టా ? మొత్తం తెలంగాణ ప్రజలు ఒక్కటై ఇవ్వకపోతె గుద్దిసంపుతం అంటే తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ కోసం మీరు ఒక్కనాడయినా లాఠీదెబ్బలు తిన్నారా ? రాస్తారోకో చేశారా ? పదవులకు రాజీనామాలు చేశారా ? ఆంధ్రోళ్లు తెలంగాణ నీళ్లు తీసుకెళ్తుంటె జెండా ఊపిన సన్నాసి పొన్నాల అని కేసీఆర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ను విమర్శించే కాంగ్రెస్ నేతలకు సిగ్గుందా ? అని ప్రశ్నించారు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*