ఆళ్లగడ్డ ఎన్నికలు యధాతధం

Share this News:

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 52 ప్రకారం యథావిధిగా ఎన్నికలు జరుపనున్నట్లు సీఈసీ తెలిపింది. సెక్షన్ 52 ప్రకారం ఈసీ గుర్తింపు లేని పార్టీ అభ్యర్థి మరణించినా ఎన్నికలు జరపవచ్చు అన్న నిబంధనలకు అనుగుణంగా సీఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శోభానాగిరెడ్డి రహదారి ప్రమాదంలో గాయపడి ఈ ఉదయం మరణించింది. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి చనిపోతే ఎన్నికలు వాయిదా వేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా గుర్తింపు రాలేదు. కాకపోతే శోభానాగిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించింది. వారు ఎన్నికలు యధావిధిగా నిర్వహించాలని ఆదేశించారు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*