అభిమానం తట్టుకోలేక నమిత !

Share this News:

బొద్దుగుమ్మలంటే తమిళ తంబీలకు చచ్చేంత పిచ్చి. బొద్దుగుమ్మ కనిపిస్తే వెంటనే గుడికట్టేస్తారు. అసలే సినిమా నటులంటే పిచ్చిగా అభిమానింnamithaచే తమిళ అభిమానులు ఈ మధ్య కాలంలో నమితను ఎక్కువగా అభిమానిస్తున్నారు. తాజాగా నామక్కల్ సమీపంలోని రెడ్డిపట్టి అనే గ్రామంలో భగవతి అనే ఆలయంలో జరిగిన ఉత్సవాలకు నమిత హాజరయింది. దర్శకుడు భాగ్యరాజాతో వచ్చిన ఆమె అక్కడ మణవాళ్కై అనే నాటక ప్రదర్శనను ప్రారంభించాలి.

నమిత వస్తుందని ముందే పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో భారీ ఎత్తున అభిమానులు పోటెత్తారు. నమిత నాటకం ప్రారంభించడానికి స్టేజీ మీదకు రాగానే బారీకేడ్లు తోసుకుని మరీ అభిమానులు ముందుకు దూసుకువచ్చారు. వారి తాకిడికి స్టేజీ ఒరిగిపోయింది. నిర్వాహకులు ఎలాగో తంటాలు పడి నమితను పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి తీసుకెళ్లారు. నమిత గాయపడిందని ప్రచారం జరగడంతో ఏకంగా మూడు అంబులెన్సులు అక్కడ వచ్చి వాలాయి. చివరకు తనకేమీ కాలేదని చెప్పి నమిత నాటకం ప్రారంభించకుండానే వెళ్లిపోయింది. దర్శకుడు భాగ్యరాజా నాటకాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. ఎంతయినా తమిళతంబీల అభిమానమే వేరు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*