జీర్ణించుకోలేకపోతున్న జగన్

Share this News:

“ఎన్నికల్లో రుణాలు మాఫీ చేస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కానీ జగన్ మాత్రం తాను రుణమాఫీ చేయలేనని చేతులెత్తాడు. ఇప్పుడు చంద్రబాబు రుణమాఫీ చేయడం ఖాయమని తెలిసి జగన్ కుళ్లుకుంటున్నాడు” అని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రూ.30 కోట్లు అని అంటున్న జగన్ గతంలో తన తండ్రి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ  స్వీకారం చేసినప్పుడు ఏం చేశాడని ప్రశ్నించారు.

ప్రతిపక్ష నాయకుడుగా ఉండే అర్హత కూడా లేకుండా పోతుందని జగన్ జీర్ణించుకోలేకపోతున్నాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశాలలో పార్టీ నేతలు తిరుగుబాటు చేయడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నాడని సోమిరెడ్డి అన్నారు.  జగన్ బారిన పడకుండా సీమాంధ్ర ప్రజలు రక్షించబడ్డారని, అందుకే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉత్సవం వేడుకగా జరుగుతుందని అన్నారు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*