ఏపీ నిధులకు జగన్ అడ్డం

Share this News:

“రాజకీయ అనుభవం లేని జగన్ మూలంగా కేంద్రప్రభుత్వానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉందని, 13 జిల్లాలు మంచిగా ఉన్నాయని, ఆర్ధికలోటు లేదని జగన్ అనడం మూలంగా కేంద్రం నిధులపై ప్రభావం చూపుతుందని” ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుపట్టారు. ఆర్థికలోటు లేదని జగన్ ఎలా అంటారని, కేంద్రం నుండి సహాయం రాకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రహీనంగా మిగులుతుందని అన్నారు.

రాష్ట్రానికి పదిహేనువేల కోట్ల లోటు అన్నది చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్ని కలిపిన తర్వాత వచ్చిన లోటా, లేక కేవలం విబజన తర్వాత రాష్ట్రంకు ఉన్న లోటా అని  ఈ సంధర్భంగా వైఎస్ జగన్ ప్రశ్నించారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడకూడదన్న ఆలోచనలో జగన్, ఆయన పార్టీ ఉన్నట్లు అనిపిస్తుందని, ప్రభుత్వానికి ప్రతిపక్షం ఇచ్చే మద్దతు ఇదేనా అని చంద్రబాబు విమర్శించారు. 

Share this News:

Leave a comment

Your email address will not be published.

*