గృహహింస కేసులో లియాండర్ పేస్

Share this News:

ప్రముఖ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ పై ఆయన భార్య, మోడల్ రియా పిళ్ళై ముంబయిలోని స్థానిక మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ leander paesకోర్టులో  గృహ హింస, వేధింపుల కేసు పెట్టింది. ఈ మేరకు లియాండర్ పేస్ తరపు న్యాయవాది ఈ విషయాన్ని మీడియాకు వెళ్లడించారు. ఈ ఫిర్యాదు మీద ఈ నెల 30న న్యాయస్థానం విచారణ చేపట్టే అవకాశం ఉంది.

ఈ మేరకు లియాండర్ పేస్, ఆయన తండ్రి వేస్ పేస్ మీద కూడా కేసు పెట్టింది. దాంతో పాటు తనకు నెలవారీ ఖర్చులకు గాను నెలకు రూ.4 లక్షలు ఇవ్వాలని రియా ఫిర్యాదులో పేర్కొంది. ఎనిమిదేళ్ల కుమార్తె గురించి కూడా రియా పిళ్లై – లియాండర్ పేస్ ల మధ్య విభేధాలు నెలకొన్నాయి. తన కూతురు బాధ్యతలు తనకు అప్పగించాలని పేస్ ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*