అవాక్కయిన కోటయ్య కమిటీ !

Share this News:

రుణమాఫీ. ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితిలు రైతులకు ప్రధానంగా ఇచ్చిన హామీ. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రైతులను రుణాలు చెల్లించవద్దని సూచించారు. డ్వాక్రా మహిళలను కూడా రుణాలు కట్టవద్దని..అన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారం దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ రైతులకు రుణమాఫీ నిజాయితీగా అందజేసేందుకు అధ్యయనం నిమిత్తం కోటయ్య కమిటీని నియమించింది. ఈ కోటయ్య పలు జిల్లాలలో రైతులు తీసుకున్న రుణాల వ్యవహారాన్ని పరిశీలించి ఆశ్చర్యపోయే అంశాలు బయటపడడంతో ఖంగుతిన్నారు.

కృష్ణా జిల్లాలో ఓ రైతు పాసు బుక్కులు, బంగారం తాకట్టు పెట్టి రైతు రుణం కింద ఏకంగా రూ.కోటి 60 లక్షల రూపాయలు తీసుకున్నట్లు తేలింది. ఇక తాడేపల్లిగూడెంలో పదిమందికి పైగా రైతులు రూ.కోటిన్నర చొప్పున  రుణాలు తీసుకుని ఎక్కువ వడ్డీ లభించే బ్యాంకులలో డిపాజిట్లు చేయడం, తమ ఇతర వ్యాపారాలకు పెట్టుబడులుగా వాడుకోవడం తెలిసి కోటయ్య కమిటీ విస్తుపోయింది. రుణమాఫీ మూలంగా ఏకంగా వేళ్లమీద లెక్కపెట్టగలిగిన సంపన్న రైతులే కోట్ల రూపాయల్లో లబ్దిపొందుతున్న విషయం తెలుసుకుని వీరి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలా ? అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజమయిన రైతుకు రుణమాఫీ  అందాలంటే క్షేత్రస్థాయిలో ఇలాంటి పరిస్థితుల మీద పూర్తి అవగాహన కలగాల్సిన అవసరం ఉంది.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*