జగన్ పార్టీలో ముసలం

Share this News:

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం రాజుకుంది. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో జగన్ పార్టీ నేతలకు పార్టీ అధినాయకత్వం మీద ఉన్న అసంతృప్తి బయటపడుతోంది. ఇక స్థానికంగా నేతల మధ్య ఉన్న విభేదాలు కూడా వెల్లడవుతున్నాయి. తాజాగా ఆ పార్టీ అరకు ఎంపీ కొత్తపల్లి గీత వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర నాయకుల మీద పలు ఆరోపణలు చేశారు. పార్టీలో మహిళలు అంటే గౌరవం లేదని, తాను మహిళను అయినందుకే ఆ పార్టీ నేతలు తనను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు.

జగన్ ఉత్తరాంధ్ర పర్యటన గురించి తనకు మాటమాత్రంగా కూడా చెప్పలేదని, విజయనగరం, విశాఖ జిల్లాల నేతలు పార్టీ కార్యక్రమాల్లో తనను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తన సేవలు పార్టీకి అవసరం లేదని వారు భావిస్తున్నట్లు అనిపిస్తుందని ఆమె అన్నారు. తాను పార్టీ మారనని, ఒకవేళ మారాల్సిన పరిస్థితులు వస్తే మాత్రం పార్టీకి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*