గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశే

Share this News:

123

విభజన నేపథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్ ఆదాయం పెంచే క్రమంలో చంద్రబాబు ప్రకటించిన సరికొత్త పారిశ్రామిక విధానం అమల్లోకి వచ్చి అన్నీ అనుకున్నట్లు సాగితే.. రాష్ట్రం రూపురేఖలే మారిపోనున్నాయి. ఇటీవల పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన శ్వేత పత్రం ప్రకారం చూస్తే త్వరలో కోస్తా ప్రాంతంలో వెయ్యి కిలోమీటర్ల మేర తీర ప్రాంత అభివృద్ధి కోసం ప్రణాళిక సిద్ధమవుతోంది. గుజరాత్ తర్వాత ఇంత సుదీర్ఘ దూరం సముద్ర తీర ప్రాంత అభివృద్ధి ప్లాన్ ఇదే అవుతుంది. దీనికోసం సముద్ర బోర్డు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కొత్త పారిశ్రామిక విధానం రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచి.. బడ్జెట్ మిగులయ్యే అవకాశాలు కల్పిస్తుందని ఆశిస్తున్నారు. పారిశ్రామిక వేత్తలకు అత్యంత అనుకూలమైన విధానంగా దీన్ని భావిస్తున్నారు. సింగిల్ విండో విధానం ప్రకటించడం ద్వారా పారిశ్రామిక విధానాన్ని సరళతరం చేసిన ప్రభుత్వం.. ప్రతి జిల్లాకు నోడల్ అధికారిని కూడా నియమించనుంది. మెగా ప్రాజెక్టుల క్లియరెన్స్ కోసం హైపవర్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం పారిశ్రామిక విధానంలో మరో హైలైట్. కోస్తా ప్రాంతంలో ఏర్పాటు కాబోతున్న పెట్రోలియం, కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (పీసీపీఐఆర్) రూ.3.43 లక్షల పెట్టుబడులు రాబడుతుందని అంచనా. ఇప్పటికే దీనికోసం ఏపీఐఐసీ ల్యాండ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. మరోవైపు ఐటీ, ఫిషరీస్, టూరిజం, టెక్స్‌టైల్స్, ఫుడ్ పార్క్స్, బయోటెక్నాలజీ, లైవ్ స్టాక్, హార్టికల్చర్ ఇండస్ట్రీలను కూడా అభివృద్ధి చేసే లక్ష్యంతో బ్లూ ప్రింట్స్ తయారు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
గేట్‌వే పోర్టుగా విశాఖ
తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా విశాఖపట్నం పోర్టును గేట్ వే పోర్టుగా చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇక్కడ కంటైనర్ కార్గోకు మరింత ప్రోత్సాహం లభించనుది. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని తలపోస్తున్న ప్రభుత్వం… ఢిల్లీ టు విశాఖపట్నం టు భోపాల్ ఫ్రీట్ కారిడార్ ను ప్రతిపాదించబోతోంది.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*