శంషాబాద్ లో 216 అడుగుల విగ్రహం

Share this News:

అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న అత్యంత భారీ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అందరిని అలరిస్తుంది. దాని పొడవు 93 మీటర్లు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుramanujacharyaడు ప్రస్తుత భారత ప్రధాని నరేంద్రమోడీ గుజరాత్ లోని నర్మదా నది వద్ద 597 అడుగుల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇక దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రుల అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుస్సేన్ సాగర్ లో 58 అడుగుల ఎత్తున్న బుద్దవిగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం ఎంతో శ్రమించారు. హుస్సేన్ సాగర్ మధ్యలో దానిని ఏర్పాటు చేసిన తరువాత ట్యాంక్ బండ్ కు కొత్త కళ వచ్చింది.

అయితే ఇప్పుడు శంషాబాద్ సమీపంలో ప్రముఖ ఆద్యాత్మికవేత్త చినజీయరు స్వామి ఆశ్రమం ఉంది. మై హోం సిమెంట్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు విరాళంగా ఇచ్చిన ఆ స్థలంలో జీయరుస్వామి గుడిని నిర్మించారు. అక్కడ వేద పాఠశాలను నెలకొల్పారు. పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్నారు. అయితే ఆయన ఇప్పుడు సమానతా విగ్రహం పేరుతో విశిష్టద్వైతాన్ని ప్రబోదించిన రామానుజాచార్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని ఎత్తు 216 అడుగులు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా ఇది పదిహేను అడుగుల ఎత్తు ఎక్కువ కావడం విశేషం.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*