అసదుద్దీన్ అహంకారం !

Share this News:

మైనార్టీ కార్డును అడ్డంపెట్టుకుని, ముస్లింల పార్టీగా పేరు పడి పాతబస్తీలో పాగా వేసిన ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఆయన సొదరుడు అక్బరుద్దీsadన్ ఓవైసీలు ఈ దేశంలో ఏం చేసినా చెల్లుతుందని అహంకారంతో, కండకావరంతో మాట్లాడుతున్నారు. ఓట్ల రాజకీయాలకు అలవాటు పడ్డ దేశంలోని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఇటువంటి వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి వారి చర్యలకు, మాటలకు అంతులేకుండా పోతుంది.

“భారతదేశం ఒకవేళ పాకిస్తాన్ మీద యుద్ద ప్రకటిస్తే భారతదేశంలోని ముస్లింలు పాకిస్తాన్ సైన్యంలో చేరి పోరాడతారు” అని తాజాగా జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఈయన వ్యవహారం చూస్తుంటే ఈయన పిచ్చి పీక్ లెవెల్ కు వెళ్లినట్లు అనిపిస్తోంది. ఈ దేశంలో ఉంటూ ..ఇక్కడి సౌకర్యాలు అనుభవిస్తూ ..ఇక్కడి అత్యున్నత చట్టసభలో సభ్యుడిగా ఉన్న అసదద్దీన్ ఇలా వ్యాఖ్యలు చేయడం గర్హించదగిన విషయం. ఆయన మాటలు పాతబస్తీ ముస్లింలు అయినా వింటారు అన్నది అనుమానమే. అసలు ఇక్కడి ముస్లింలు అంటేనే పాకిస్తాన్ పురుగులను చూసినట్లు చూస్తుందని అంటారు. మరి ఇలాంటి స్టేట్ మెంట్లతో ఓవైసీ ఏం సాధించదలుచుకున్నాడో ?

వెంటనే ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసి, చట్టపరమయిన అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ ఉన్నన్నాళ్లు ఆయన పంచనజేరి పాతబస్తీలో అడ్డగోలు అక్రమాలకు పాల్పడిన ఓవైసీలు ఆ తరువాత కాంగ్రెస్ సహకారంతో తమ పనులు కొనసాగించుకున్నారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే టీఆర్ఎస్ పార్టీ పంచన చేరి చక్రం తిప్పుతున్నారు.

ఇలాంటి దేశద్రోహుల విషయంలో టీఆర్ఎస్ పార్టీ కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే టీఆర్ఎస్ పార్టీకి అసలుకే ఎసరు వస్తుంది. ఓట్ల కోసం రాజీపడి ఎంఐఎం అడుగులకు మడుగులు ఒత్తితే ఎన్నికల్లో జనం టీఆర్ఎస్ కు బుద్దిచెప్పేందుకు వెనకాడరు. ఎప్పుడూ మతం కార్డుతో ప్రభుత్వాలు అంటిపెట్టుకునే ఇలాంటి పార్టీలను అణగదొక్కాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*