మోడీ చాలా షార్ప్ గురూ..

Share this News:

నరేంద్ర మోడీ..ఇప్పుడు భారదేశంలో అత్యంత పాపులర్ అయిన వ్యక్తిపేరు. ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు మోడీ నామస్మరణ చేస్తున్నాయి. అటువంటి మోడీ సాధారణ ఆర్ఎmodiస్ఎస్ కార్యకర్తగా జీవితం ప్రారంభించి.. దేశానికే ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి. జీవితంలో అనేక ఎత్తుపల్లాలు చూశారు. ఘటనా ఘటన సమర్థులను ఎదుర్కొన్నారు. ఢక్కామొక్కీలు తిని బాగా రాటుదేలారు. అందుకే పాత్రికేయులకు ఆయన్ను ఇంటర్వ్యూ చేయడం అంటే అంత సులభం కాదు. ఆయన్ను ఇంటర్వ్యూ చేయాలంటే బాగా ప్రిపేర్ అయి వెళ్లాల్సిందే. ఆయన్ను తక్కువగా అంచనా వేస్తే ఆ విలేకరి ఇరుక్కుపోయినట్టే. మన జాతీయ మీడియాకు ఆ విషయం బాగా తెలుసు.. అందరి రాజకీయ నాయకులపై ప్రశ్నలు గుప్పిస్తూ వారితో ఆటాడుకునే అర్నాబ్ గోస్వామి, కరణ్ థాపర్,  రాజ్దీప్ సర్దేశాయ్ తదితర మహామహులే మోడీతో ఇంటర్వ్యూ అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు.

ఇప్పడు మోడీ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి పాకింది.ఆయనను ఇంటర్వ్యూ చేయడమంటే ఎంత కష్టమో తెలిసొచ్చింది. ఇదే విషయాన్ని సీఎన్ఎన్ వరల్డ్ ప్రతినిధి ఒకరు తాజాగా చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీని తాను తక్కువగా అంచనా వేశానని, కానీ ఇప్పటివరకు తాను చూసిన నాయకులందరిలో ఆయనే చాలా షార్ప్‑ అని ఫరీద్ జకారియా అనే ఆ పాత్రికేయుడు చెప్పారు. ఆయన చాలా తెలివైనవారని, అన్ని విషయాలపై దృష్టి బాగా కేంద్రీకరిస్తారని, ఆయనకు దీర్ఘకాలిక ఎజెండా ఉందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మంచి రాజనీతిజ్ఞుడిగా పేరుతెచ్చుకోవాలన్నది ఆయన లక్ష్యమని,గతంలోకి చూసి బాధపడేకంటే భవిష్యత్తులోకి చూసి సాధించడం ఆయనవద్దే నేర్చుకోవాలని జకారియా అన్నారు. ఆ పాత్రికేయుడి వ్యాఖ్యలు విన్నవారంతా మోడీ చాలా షార్ప్ గురూ అంటున్నారు. నిజమే కదా??

Share this News:

Leave a comment

Your email address will not be published.

*