బాహుబలి డేటు ఫిక్సయిందా?

Share this News:

2

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మంగా, అత్యధిక బడ్జెట్, అత్యంత భారీ అంచనాలతో విడుదల కాబోతున్న సినిమా ‘బాహుబలి’. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమా 2015లో విడుదలవుతుందని.. పోయినేడాది సినిమా షూటింగ్ మొదలైనప్పుడే ప్రకటించారు. ఐతే వచ్చే ఏడాది ఎప్పుడు రిలీజవుతుందన్నది మాత్రం క్లారిటీ లేదు. ఐతే వచ్చే ఏడాది వేసవిలో ఏప్రిల్ 17న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. బాహుబలిగా ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క, రానా, తమన్నా, ప్రకాష్ రాజ్, అడివి శేష్, నాజర్, రమ్యకృష్ణ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*