మోడీ కెమ్ ఛో ?

Share this News:

obma with modiమీరు కన్ఫ్యూజ్ అయ్యారంటే మీకు గుజరాతీ రాదని అర్థం. ఎందుకంటే “మోడీ కెమ్ ఛో” అంటే “మోడీ బాగున్నారా?” అని అర్థం. ఈ మాట అన్నది ఎవరో తెలుసా? అమెరికా అధ్యక్షుడు ఒబామా. అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన విందుకు మోడీ హాజరైన సందర్భంగా ఆయనను సరదాగా గుజరాతీలో పలకరించారు. దీనికి ఖుషీ అయిపోయిన మోడీ “థాంక్యూ వెరీమచ్ ప్రెసిడెంట్” అంటూ నవ్వుతూ రిప్లయి ఇచ్చారట.

ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే… భారత ప్రధానిని ఆయన మాతృభాషలో ఒక అమెరికా అధ్యక్షుడు పలకరించడం ఇదే మొదటి సారి అట. అధ్యక్ష భవనంలో మోడీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఒబామా తలుపులు కూడా తానే తెరిచారు. గత 35 సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాల్లో ఉపవాస దీక్షను పాటిస్తున్న మోడీ అధ్యక్ష భవనంలోనూ దానిని పాటించారు. ఆయన నమ్మకాలను గౌరవిస్తూ మాకు ఏ ఇబ్బంది లేదని అమెరికా ప్రకటించింది. దీంతో అమెరికా అధ్యక్షుడి విందుకు హాజరై భోజనం ముట్టని తొలి ప్రధాని అయ్యారు మోడీ. మోడీ సింగిల్ కావడంతో ఒబామా కూడా సింగిల్ గానే వచ్చారు. ఒబామా సతీమణి మిషెల్ ఈ విందుకు హాజరు కాలేదు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*