యువకుడిని బయటకు తోసేసిన ప్రీతి జింటా

Share this News:

చాలా మంది హీరో హీరోయిన్లు తెరమీదే నాయికా నాయకులుగా ఉంటారు. ఎంతో ధైర్యంతో కష్టాలను,శత్రువులను ఎదుర్కొంటారు. అయితే వీరిలో చాలా కొంచెం మంది మాత్రమే నిజ జీవితంలోనూ తమప్రత్యేకతను చూపిస్తుంటారు. దేశభక్తి చూపించాలన్నా, ఎంతటి క్లిష్టమైన అంశాన్నైనా ధైర్యంగా ఎదుర్కొనే సత్తా ఉన్న అతి కొద్ది నటీనటుల్లో ప్రీతి జింటా పేరు ముందుగా చెప్పుకోవాలి. కశ్మీర్ వెళ్లి సైనికులకు మద్దతుగా మాట్లాడినా.. మాఫియా బెదిరించినా లొంగకుండా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆమె తన ప్రత్యేకతను నిరూపించుకుంది.ఇప్పుడు మరోసారి అటువంటి సాహసం చేసింది ఈ సొట్టబుగ్గల సుందరి.
ఇటీవల విడుదలైన హృతిక్ రోషన్ సినిమా బ్యాంగ్ బ్యాంగ్ చూడడానికి ప్రీతి థియేటర్ కివెళ్లింది. అక్కడ సినిమా ప్రారంభానికి ముందు జనగణమన వస్తుంటే అందరూ లేచి నిలబడ్డారు. అయితే ఓ యువకుడు మాత్రం లేచి నిలబడడానికి నిరాకరించాడు. దీంతో మన సొట్టబుగ్గల సుందరికి కోపం నషాళానికంటింది. వెంటనే ఆ యువకుడిని మెడపట్టి థియేటర్ లోంచి బయటకు తోసేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అయితే ఈ అంశంలో ప్రీతి చర్యను కొందరు తప్పుపడుతున్నారు. దేశభక్తి ఉండొచ్చు కానీ మరీ అంత తలబిరుసు తనం సరికాదని ట్విట్టర్ లో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎవరేమనుకున్నా ప్రీతి ధైర్యానికి మెచ్చుకోవాలసిందే.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*