టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్షకు కారణం ఇదేనా?

Share this News:

trsటీఆర్ఎస్ దెబ్బకు తెలుగుదేశం పార్టీకి దిమ్మ తిరుగుతోంది. ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ గద్దలా ఎగరేసుకు పోతుండడంతో టీడీపీ విలవిలలాడుతోంది. ఇంతకీ టీఆర్ఎస్ ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్షకు కారణమేంటి..? మేనల్లుడు హరీశ్ రావుకు అడ్డుకట్ట వేసి కొడుకు కేటీఆర్ ను పార్టీలో తిరుగులేని నేతగా చేసి తన వారసత్వాన్ని అందించడానికి కేసీఆర్ టీడీపీ నాయకులను తమ పార్టీలోకి చేర్చుకోవడాన్ని ఉద్యమంలా చేపట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే తమకు మెజారిటీ ఉండగా టీడీపీ ఎమ్మెల్యేలతో పనేంటి అని టిఆర్ఎస్ కల్లబొల్లి వాదనలు చేస్తున్నా అసలు కారణం మాత్రం అదేనని రాజకీయవర్గాలో్ల జోరుగా చర్చ సాగుతోంది.

తెలుగుదేశం, కాంగ్రేస్ నేతలు ఈ ఆపరేషన్ ఆకర్ష్ కు వేరే కారణాలున్నాయంటున్నారు.
కేసీఆర్ తన రాజకీయ వారసుడిగా కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్)ను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏదో ఒక రోజు ఆ విషయం ప్రకటిస్తారు కూడా. ఇక అప్పడు హరీశ్ రావు నుంచి ప్రతిఘటన తప్పదు. టీఆర్ఎస్ లో కేసీఆర్ తరువాత ఆ స్థాయిలో పట్టున్న హరీశ్ తిరుగుబాటు చేసే అవకాశాలూ తక్కువేం కాదు. అదే జరిగితే ఏం చేయాలి.. మరింత మంది నమ్మకమైన ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ఆ పరిస్థితిని ఎదుర్కోవడం సాధ్యమవుతుంది. ఆ కారణంగానే కేసీఆర్ ఇతర పార్టీలకు చెందినవారిని టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారన్నది పలువురు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నాయకుల విమర్శ. మొత్తానికి ఈ ఆకర్షణ మంత్రం వెనుక ఉన్న ఉద్దేశం ఏదైనా కానీ టీఆర్ఎస్ లో చేరుతున్న టీడీపీ నాయకులకు మాత్రం మంచి ప్యాకేజీలే అందుతున్నాయట.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*