ఈ కుర్చీతో ఒంటరితనం మాయం !

Share this News:

japan chair

మీరు ఒక్కరే ఉంటున్నారా ? మీరు ఒంటరితనంతో బాధపడుతున్నారా ? మీ ఒంటరితనాన్ని పోగొట్టేందుకు ఎవరియినా మిమ్మల్ని ఆదరిస్తే బావుండునని భావిస్తున్నారా . అయితే మీరు బాధపడాల్సిన అవసరం ఇక లేదు. మీకోసం జపాన్ కు చెందిన యూనికేర్ సంస్థ ఓ కుర్చీని తయారు చేసింది. మీరు అందులో కూర్చుంటే చాలు మీ ఒంటరితనం మాయమవుతుంది. మీతో పాటు ఇంకెవరో కలిసి ఉన్న అనుభూతి మీ సొంతం అవుతుంది. అచ్చం మనిషిలా రూపొందించిన ఈ కుర్చీ ఖచ్చితంగా మీకు స్వాంతన చేకూరుస్తుందని చెబుతున్నారు.

మీరు కుర్చీలో కూర్చుంటే మిమ్మల్ని ఎవరో తడుముతున్నట్టు, మీరు రెండు చేతులు ఎవరి భుజం మీదనో వేసిన అనుభూతి వంటివి కలుగుతాయని, మీతో ఎవరో కలిసి ఉన్నారన్న అనుభూతి ఒంటరితనాన్ని దూరం చేస్తుందని కుర్చీ తయారీదారులు చెబుతున్నారు. వృద్దులకు ఇది ఎక్కువగా పనికివస్తుందని చెబుతున్నారు. అయితే దీని ధర మాత్రం బాగా ఎక్కువే. మన కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ.25 వేలు కావడం విశేషం.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*