కార్తీక శోభతో పులకించిన అమెరికా

Share this News:

కార్తీక మాసం చివరి సోమవారం, ఏకాదశి పండుగను పురస్కరించిన అమెరికాలో తెలుగు వారు కార్తీక మాస పూజలు ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని హిందూ దేవాలయాలన్నీ కిటకిటలాడాయి. ముఖ్యంగా స్త్రీలు ఉపవాస దీక్షలు చేసి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కుటుంబ సమేతంగా ఆచరించారు. కార్తీక దీపాల శోభతో అన్నిదేవాలయాలు శోభిల్లాయి. లావణ్య పనుకుమాటి, మాధవి పాతూరి ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలను ఘనంగా నిర్వహించారు.

కాలిఫోర్నియా రాష్ట్రం ఫ్రీమాంట్ నగరంలోని హిందు దేవాలయ పూజారి కుమారస్వామి క్రిస్తిపాటి ఈ పర్వదిన విశిష్టత గురించి వివరిస్తూ… కార్తీక సోమవారం, ఏకాదశి, సూర్య సంక్రమణం ఒకేరోజు రావడం చాలా విశిష్టమన్నారు. ఆరోజు కార్తీక వ్రతాన్ని ఆచరించి దేవాలయంలో దీపాలు వెలిగించి సత్యనారాయణ వ్రతం ఆచరించిన వారికి భగవంతుని కటాక్షం లభిస్తుందన్నారు.

telugu nri (1).. telugu nri (2). telugu nri (3). telugu nri (5). telugu nri (6). .
telugu nri.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*