జగన్ ధర్నా: చెడు వినకు ..చెడు చూడకు

Share this News:

ysrcp

రుణమాఫీ అమలు విషయంలో చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో మహాధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన ధర్నాకు వ్యతిరేకంగా విజయవాడలో తెలుగుదేశం పార్టీ కూడా ధర్నాకు దిగింది. అధికార పార్టీగా ఉన్న టీడీపీ నుండి ధర్నా చేయడాన్ని మీడియా టీడీపీ విజయవాడ నగర అద్యక్షుడు బుద్దా వెంకన్నను ప్రశ్నించింది. దీనికి ఆయన భలే సమాధానం చెప్పారు. “మేం చేస్తున్నది ధర్నా కాదు. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు ..అన్న మహాత్మాగాంధీ మాటను ప్రజలు పాటించాలని ఈ వినూత్న నిరసన చేపట్టాం” అని సమాధానం ఇచ్చారు. అంతే కాదు ఈ నిరసన కూడా గాంధీ విగ్రహం ముందే చేపట్టడం గమనార్హం.

ఇది ఇలా ఉంటే వైఎస్ జగన్ కు మంత్రి గంటా శ్రీనివాసరావు 25 ప్రశ్నలు సంధించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ టీడీపీ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందని, మీరు ఎందుకు ధర్నాలు చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్ పార్టీ నుండి ఒక్కో నేత వెళ్లిపోతున్నారని, పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు జగన్ ఈ ధర్నా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులు జగన్ కు కనిపించడం లేదని, జగన్ ను ప్రతిపక్షానికి పరిమితం చేసి ప్రజలు తీర్పు ఇచ్చినా జగన్ గుణపాఠం నేర్చుకోలేదని, అనవసర రాద్దాంతాలు చేస్తూ ప్రభుత్వం మీద బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు.

 

 

Share this News:

Leave a comment

Your email address will not be published.

*