సింహాన్నే నమ్ముకుంటున్న బాలయ్య

Share this News:

సాధారణంగా సినిమా వాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ. అందులో బాలయ్య బాబుకు మరీ ఎక్కువ. ఆయన సూపర్ డూపర్ హిట్లు టైటిల్లో సింహం అర్థమో, బొమ్మో ఉన్నవే. దాంతో ఆయన ఆ సెంటిమెంటుకు ఫిక్సయిపోయారు. ఈ సెంటిమెంట్ కేవలం సింహానికి సంబంధించినదే కాదు, నరసింహస్వామి భక్తుడైన బాలయ్య భక్తికి సంబంధించినది కూడా. తాజాగా బాలయ్య అందరికీ భిన్నంగా ప్రజలకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. సరిగ్గా అర్ధరాత్రి తర్వాత  వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తన కొత్త సినిమా “లయన్” టీజరు విడుదల చేశాడు. ఎప్పటిలాగే బాలయ్య అభిమానులకు కావల్సిన మసాలా అంతా ఆ సినిమాకు కనిపిస్తుండటం విశేషం.

“కొందరు కొడితే ఎక్సరే లో కనిపిస్తుంది

కొందరు కొడితే స్కానింగ్ లో కనిపిస్తుంది

నేను కొడితే హిస్టరీలో కనిపిస్తుంది” అంటూ బాలయ్య అభిమానులకు విడదుల వరకు సరిపడా డైలాగ్ డోస్ ఇచ్చాడు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*