ఆ రోజు సముద్రంలో ఏం జరిగింది ?

Share this News:

terror

ముంబయి తరహా దాడులకు లష్కరే తోయిబా మరో సారి పథకం రచించింది. సముద్ర మార్గం నుండి ముంబయిలోకి ప్రవేశించి అప్పట్లో నరమేధం సృష్టించిన ఈ ఉగ్రవాద సంస్థ ఇప్పుడు అదే విధంగా జనవరి 26 రిపబ్లిక్ డే ను లక్ష్యంగా చేసుకుని భారతదేశంలో విధ్వంసం సృష్టించేందుకు పథకం వేసింది. నలుగురు ఉగ్రవాదులు పాకిస్థాన్ లోని కరాచీ నుండి పాక్ సముద్ర జలాల నుండి భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. పది కిలోమీటర్ల మేర చొచ్చుకు వచ్చిన పడవను భారత కోస్ట్ గార్డులు అడ్డగించడంతో పడవలోని లైట్లన్నీ ఆర్పేసి దానిని భారత్ వైపు వేగంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు.

ఈ లోపు కోస్ట్ గార్డులు అప్రమత్తమై ఆ పడవను చుట్టుముట్టారు. పడవలో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకునేందుకు హెచ్చరికలు చేశారు. నాలుగు వైపుల నుండి పడవను చుట్టుముట్టి లొంగిపోవాలని సూచించారు. దీంతో వారు కరాచీలోని వారికి ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఆ పడవ ముందుకు వెళ్లేందుకు ఎలాంటి అవకాశం లేకపోవడంతో పై నుండి వచ్చిన సూచనల మేరకు పడవ కింది భాగంలోకి వెళ్లి దానికి నిప్పటించారు. దీంతో భారీ పేలుడుతో ఆ పడవ కాలిపోయింది. ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా చేసేందుకే ఈ ప్రయత్నాలు చేసినట్లు కోస్ట్ గార్డులు చెబుతున్నారు. నిఘావర్గాల సూచనమేరకు కోస్ట్ గార్డులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ ఉగ్రవాదులను గుర్తించకుంటే వారు గుజరాత్ లోని పోరుబందరు ద్వారా భారత్ లోకి ప్రవేశించేవారని చెబుతున్నారు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*