జగన్ జోస్యం నిజమవుతుందా?

Share this News:

jagan mohan reddy ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం కేవలం రెండేళ్లేనని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి జోస్యం చెప్పారు. ఒకవేళ, నాలుగేళ్లు ఉన్నా ఆ తర్వాత అధికారం తనదేనని, ముఖ్యమంత్రి అయ్యేది తానేనని జగన్ చెప్పారు. వాస్తవానికి, ప్రతిపక్ష నేత స్థానంలో ఉన్న ఆయన వ్యాఖ్యలు ఎంత హాస్యాస్పదమో రాజకీయాల గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు.

మన ప్రజాస్వామ్యంలో ఏది జరిగినా ఎన్నికలు వచ్చేది ఐదేళ్లకే. మరొక విషయం ఏమిటంటే, ప్రస్తుతం టీడీపీకి పూర్తి మెజారిటీ ఉంది. ఆ పార్టీలోంచి సగానికి సగం మంది వైసీపీలోకి వచ్చేస్తే లేదా టీడీపీని విడిచిపెట్టేస్తే తప్ప.. రెండేళ్లలో ఎన్నికలు జరగడమనేది అసాధ్యం. టీడీపీ నుంచి సగానికి సగం మంది బయటకు వచ్చేయడం కూడా అంతే అసాధ్యం. ఇటువంటి పరిస్థితుల్లో రెండేళ్లలో ఎన్నికలు ఎలా వస్తాయో జగన్ కే తెలియాలి. ఎన్నికలు అయిపోయిన వెంటనే ఐదేళ్లే కదా తిరిగి వచ్చేస్తాయని జగన్ అన్నారు. ఎన్నికల్లో ఓటమి ఫీలింగ్ నుంచి జగన్ ఇంకా బయట పడినట్లు లేరు. అందుకే ఐదేళ్లను ఇప్పుడు రెండేళ్లకు కుదించుకున్నారు. ఎంత త్వరగావీలయితే అంత త్వరగా తాను ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కంటున్నారు. కలలు కనవచ్చు కానీ దానికి కూడా ఒక హద్దు ఉండాలి కదా?
మరొక ముఖ్య విషయం ఏమిటంటే.. జోతిష్యం ప్రకారమే చూసుకుంటే జగన్ కు అసలు ముఖ్యమంత్రి అయ్యే యోగమే లేదు. జగన్ మినహా ఆయన కుటుంబంలోని ఎవరి పేరిట ఎన్నికలకు వెళ్లినా గత ఎన్నికల్లోనే విజయం సాధించి ఉండేవారని, జగన్ పేరిట ఎన్నికలకు వెళ్లడంతోనే చివరి నిమిషంలో ఓటమి పాలయ్యారని జోతిష్యులు చెబుతున్నారు. ఈ విషయాన్ని కూడా జగన్ ఒకసారి సరిచూసుకుంటే మంచిది. ఒకవేళ జోతిష్యుల మాటలు నిజమవుతాయని అనుకున్నా.. రెండేళ్లలో చంద్రబాబు అధికారాన్ని కోల్పోయినా జగన్ కు మాత్రం అధికార పగ్గాలు రావని వివరిస్తున్నారు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*