వందల్లో కాదు.. వేలల్లో ‘పార్టీలు’

Share this News:

parties-of-indiaమీకు తెలిసిన రాజకీయ పార్టీల పేర్లు చకచకా చెప్పేయండని ఎవరైనా అడిగితే మీరేం చేస్తారు. వెనకాముందు చూడకుండా చెప్పేయటం మొదలు పెడతారు. మహా అయితే.. పది లేదంటే ఓ పాతిక వరకు చెప్పి ఆగుతారు. ఇలాంటివి మరికొన్ని ఉంటాయని చెప్పే అవకాశం ఉంది.

కానీ.. వాస్తవానికి దేశంలో ఉన్న రాజకీయ పార్టీలుఎన్నో తెలుసా అని అడిగితే మాత్రం నోట వెంట మాట రాదు. వచ్చినా దాదాపుగా తప్పు చెప్పే అవకాశమే ఎక్కువ. ఎందుకంటే.. రాజకీయ పార్టీలు వందల్లో కాదు.. దేశంలో వేలల్లో ఉన్న విషయాన్ని ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది.

ఎన్నికల సంఘం జాబితా ప్రకారం దేశంలో రిజిష్టర్‌ అయిన రాజకీయ పార్టీల సంఖ్య అక్షరాల 1807గా పేర్కొన్నారు. ఇందులో ఆరు పార్టీలకు మాత్రమే జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి.

మరో 64 పార్టీలకు రాష్ట్రస్థాయి హోదా కల్పించారు. ఈ రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీల్లోకొన్ని రెండు మూడు రాష్ట్రాల్లోనూ గుర్తింపు పొందాయి. ఇక.. జాతీయపార్టీల విషయానికి వస్తే.. బీజేపీ.. కాంగ్రెస్‌.. బీఎస్పీ.. ఎన్సీపీ.. సీపీఐ.. సీపీఎం పార్టీలుగా గుర్తింపు పొందాయి. ఇక.. ఎన్నికల సంఘం గుర్తింపు పొందని రాజకీయ పార్టీలు మొత్తం 1737 పార్టీలు ఉన్నట్లుగా వెల్లడించారు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*