‘దేవుడ్ని’ ఇంటర్వ్యూ చేయటం అదృష్టమన్నారు

Share this News:

pawan kalyan interviewగోపాల గోపాల చిత్రానికి సంబంధించి.. పవన్‌కల్యాణ్‌ ఫాంహౌస్‌లో తాజాగా ఇంటర్వ్యూ ఇవ్వటం.. దాన్ని టెలికాస్ట్‌ చేయటం తెలిసిందే. రెగ్యులర్‌కు కాస్త భిన్నంగా కాస్త ఎక్కువగానే సమయాన్ని ఇచ్చిన పవన్‌ మాటలే కాదు.. ఇంటర్వ్యూ చేసే వారి యాంకర్లకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు చాలానే ఉన్నాయి.

మామూలుగా ఒక ప్రముఖ వ్యక్తిని ఇంటర్వ్యూ చేసే అవకాశం రావటం కాస్త ఆనందమే. ఇక.. పవన్‌కల్యాణ్‌ లాంటి అగ్రనటుడ్ని ఇంటర్వ్యూ చేయటం అరుదైన అవకాశంగానే చెప్పాలి. అందుకే కాబోలు.. ఇంటర్వ్యూ చేసిన ముగ్గురు యాంకరమ్మలు తమకు దక్కిన అవకాశానికి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సంతోషంతో పొంగిపోయారు.

ఎడిట్‌ చేసి టెలికాస్ట్‌ చేసిన ఇంటర్వ్యూలోనే.. పవన్‌ను ఇంటర్వ్యూ చేయటంలోని ఎంగ్జైటీ వారి మాటల్లో స్పష్టంగా వినిపించి.. కనిపించింది కూడా. ఇంటర్వ్యూ చేసిన ముగ్గురిలో ఇద్దరు అయితే.. తమకీ ఇంటర్వ్యూ చేసే అవకాశం దక్కటం అదృష్టమని చెప్పేశారు. మొత్తానికి దేవుడి పాత్రలో గోపాల గోపాలలో అలరించిన పవన్‌ను ఇంటర్వ్యూ చేయటం కూడా తమ లక్‌గా చెప్పుకోవటం చూస్తే.. పవన్‌ ఇమేజ్‌ ఏ రేంజ్‌లోఉంటుందో ఇట్టే అర్థమవుతుంది కదూ.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*