రెండో రోబో అమీర్ ఖానేనా..?

Share this News:
Aamir Khanభారీ చిత్రాల దర్శకుడు శంకర్ సినిమా తీస్తున్నారంటే దేశమంతా ఆసక్తే. ఆయన సినిమాల కథ ఎంపిక నుంచి, తారాగణం, సంగీతం, నిర్మాణం అంతా హైఎండే.. బడాబడా హీరోలకు కూడా ఆయన దగ్గర అవకాశాలు రావు. గతంలో చాలామంది పెద్ద హీరోలు ఆయనతో కలిసి పనిచేయాలని చాలా ప్రయత్నాలు చేసినా ఆయన నో ఛాన్స్ అనేశారు. తనకు నప్పే హీరోలతోనే ఆయన సినిమాలు తీస్తారు. దేశంలోని పెద్ద హీరోల్లో రజనీకాంత్ ఒక్కరికే ఆయనతో మళ్లీమళ్లీ పనిచేసే అవకాశం దక్కుతోంది. ఇప్పటికే శివాజీ, రోబో సినిమాలు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. ఇప్పుడు తాజాగా రజనీ, శంకర్ ల కాంబినేషన్ లో రోబో 2 వస్తోంది. అందరిలోనూ భారీ అంచనాలు కలిగిస్తోన్న ఈ రోబో 2లో ఇంకో హెవీ వెయిట్ కూడా కనిపించబోతున్నాడు. ఆయన ఇంకెవరో కాదు బాలీవుడ్ స్పెషలిస్ట్ హీరో అమీర్ ఖాన్.
శంకర్ రోబో 2 లో అమీర్ ఖాన్ నటించనున్నాడన్న సమాచారం పొక్కడంతో ఆయన పాత్ర ఏంటన్న ఊహాగానాలు సాగుతున్నాయి. హీరోగా రజనీకాంత్ ఉండడంతో రోబో 2లో రెండు రోబోలు ఉంటాయని.. రెండో రోబో అమీరేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*