గుడ్ బై: ప్రపంచ సినీ చరిత్రలో తిరగరాయలేని రికార్డు ఇది

Share this News:

DDLJదిల్‌వాలే దుల్హనియా లేజాయింగే… 1995లో వచ్చిన ఈ సినిమా సూపర్‌ హిట్టయింది.. షారూక్‌ఖాన్‌, కాజల్‌లకు ఎంతో పేరు తెచ్చింది. ఈ సినిమాను కొన్ని వందల సార్లు చూసిన వారున్నారు. ముంబైలోని ఓ థియేటర్‌లో రిలీజ్‌ నాటి నుంచి ఇప్పటివరకు ఆడుతున్న ఈ సినిమా గురువారంతో ఆగిపోయింది. దాదాపుగా ఇరవయ్యేళ్లు ప్రదర్శితమైన సినిమాగా రికార్డుకెక్కింది.

1995 అక్టోబరు 19న విడుదలైన దిల్‌వాలా దుల్హన్‌ లేజాయింగే సినిమా అప్పటి నుంచి ముంబైలోని మరాఠీ మందిర్‌లో ప్రతి రోజూ ప్రదర్శితమవుతోంది. ఈ ఏడాది అక్టోబరు 19 వరకు దీన్ని ప్రదర్శిస్తే ఇరవయ్యేళ్లు పూర్తయ్యాయి. అయితే గురువారం ఉదయం 9.15 నిమిషాలకు వేసిన షోయే చివరి ప్రదర్శనైంది. 1995 నుంచి ఆపకుండా ప్రతి రోజూ నాలుగు ఆటలు వేస్తూండేవారు.. 2014 డిసెంబరులో 1000 వారాలు పూర్తయిన తరువాత నాలుగు ఆటలకు బదులుగా ఒక్క ఆటకు పరిమితం చేశారు. అంతేకాకుండా రెగ్యులర్‌ సినిమాలకు ఆటంకం లేకుండా ఉదయం 11.30 షోకు బదులుగా ఉదయం 9.15 షో వేసేవారు. అయితే, సిబ్బంది ఇలా రోజూ ఉదయాన్నే వచ్చి స్పెషల్‌ షో వేయడం ఇబ్బంది అవుతుందన్న కారణంతో నిలిపివేయాలని నిర్ణయించారు. దీంతో యష్‌రాజ్‌ ఫిలిమ్స్‌ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా వారు అందుకు అంగీకరించారు. ఫలితంగా గురువారం ఉదయంతో దిల్‌వాలా దుల్హన్‌ లేజాయింగే సినిమా ప్రదర్శన ఇరవయ్యేళ్ల్లు పూర్తికాకుండానే నిలిచిపోయింది.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*