ముగ్గురు హీరోయిన్ల ముద్దులు తట్టుకోలేడని..

Share this News:

south-indian-womenసినీ నటుల వారసులు తెరపై కనిపించడం మామూలే. నిరుడు మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నేనొక్కిడినే సినిమాలో స్క్రీన్ పై కనిపించిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే షారూక్ ఖాన్ కొడుకు అభిరామ్ కూడా హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలో తన అప్పియరెన్సు ఇచ్చాడు. ఇప్పుడు అల్లు అర్జున్ ముద్దుల కొడుకు వంతు వచ్చింది.. అల్లు అర్జున్ తాజా చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి లో ఈ చిన్నోడు కనిపించనున్నాడట.
అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ లో ముగ్గురు హీరోయిన్లు సమంత, నిత్య మీనన్‌, ఆదా శర్మ ఫుల్ షో చేయనున్న సంగతి తెలిసిందే కదా. సినిమాలో ఒక్క హీరోయిన్ ఉంటేనే కనుల పంట.. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు ఉంటే ఫ్యాన్సు ఏమైపోవాలో మరి. ముగ్గురు హీరోయిన్లు ముద్దులు కురిపిస్తే బన్నీ తట్టుకోవడం కష్టం కాబట్టి ఆ ముద్దులను ఈ చిన్నారి వైపు డైవర్టు చేయడానికే బన్నీ కొడుకు తీసుకున్నాం అంటోంది సినిమా యూనిట్.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*