జనసేన ‘మన’సేన కానుందా….?

Share this News:

ramcharan tejaజనసేన అధినేత, సినీహీరో పవన్ కళ్యాణ్ కు కుటుంబం నుంచి సపోర్టు దొరుకుతోందా…. అన్నయ్య చిరంజీవి ఇంకా బయటపడకపోయినా ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పవన్ కు సపోర్టుగా ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారా అంటే అవునంటున్నారు కొందరు. అంతేకాదు, జనసేన పార్టీలో రామ్ చరణ్ చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2019 నాటికి మెగాస్టార్ చిరంజీవి కూడా జనసేన పార్టీలో చేరుతారని… జనసేనను బలోపేతం చేసి 2019 ఎన్నికల బరిలో దిగుతారని అంటున్నారు.

ఇటీవల రామ్ చరణ్ అభిమానులతో మాట్లాడినప్పుడు ‘జనసేన’ పార్టీ మన సొంత పార్టీ అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ సభకు హాజరైన అభిమానులు జై పవన్, జై జనసేన అంటూ నినాదాలు చేసారని, రామ్ చరణ్ కూడా తిరిగి అవే నినాదాలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచినట్లు తెలుస్తోంది. చెర్రీ మన పార్టీ అనడంతో చిరంజీవి కుటుంబం జనసేనను మనసేనగా మార్చుకుంటుందని భావిస్తున్నారు.
నిజానికి చెర్రీ ఇంకా తండ్రి చాటు బిడ్డే… అలాంటిది ఆయన ఓపెన్ గా ఇలా బాబాయి పవన్ కు మద్దతు పలికారంటే దాని వెనుక చిరంజీవి ఉండడం ఖాయమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అదే నిజమైతే పవన్ ను ముందు పెట్టి చిరంజీవి మళ్లీ సొంతంగా రాజకీయాల్లోకి వస్తారని… వచ్చే 2019 ఎన్నికలు రసవత్తరంగా మారుతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*