అల్లు వారి పిల్లోడు తెరంగేట్రం చేస్తున్నాడా?

Share this News:

allu-ayaanఅల్లు అయాన్‌.. ఈ పేరును కొత్తగా జనాలకు పరిచయం చేయనక్కర్లేదు. పుట్టిన కొన్ని రోజులకే స్టార్‌ అయిపోయాడు అల్లు అర్జున్‌ ముద్దుల కొడుకు. తొలిసారి నాన్నతో కలిసి చేసిన ఫొటో షూట్‌తో లక్షల లైకులు కొట్టించుకున్నాడు ఈ బుడ్డోడు. ఆ పాపులారిటీ సరిపోదని.. అకేషన్‌కు తగ్గట్లు ఈ చిన్నోడిని ముస్తాబు చేసి ఫొటోషూట్‌లు చేయిస్తూ జనాల్ని ఆకర్షిస్తోంది బన్నీ ఫ్యామిలీ. బాలల దినోత్సవం రోజు చాచా నెహ్రూలా తయారై.. హోలి రోజు రంగుల మధ్య నవ్వులు చిందిస్తూ.. ఇలా రకరకాలుగా ఆకట్టుకున్నాడు అయాన్‌.

ఐతే ఈ ఏడాది బుడ్డోడి తెరంగేట్రానికి కూడా రంగం సిద్ధమైందని అంటున్నారు. బన్నీ కొత్త సినిమా సన్నాఫ్‌ సత్యమూర్తిలో అయాన్‌ తళుక్కుమంటాడని టాలీవుడ్‌ సమాచారం. ఓ పాటలో అయాన్‌ అలా కనిపించి వెళ్లిపోయేలా సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశాడట బన్నీ. ఇప్పటికే ఈ సినిమాలో లెక్కలేనంత మంది తారాగణం ఉన్నారు. బన్నీ సరసన సమంత, ఆదా శర్మ, నిత్యామీనన్‌ నటిస్తుంటే.. ఉపేంద్ర, స్నేహ, ప్రకాష్‌ రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌ లాంటి చాలామంది ప్రముఖ నటీనటులున్నారీ సినిమాలో. వీళ్లందరితో పాటు అయాన్‌ కూడా సందడి చేయబోతున్నాడన్నమాట.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*