అసదుద్దీన్‌ ఒవైసీ ఆగడాలకు మరో అడ్డుకట్ట

Share this News:

asadఎమ్‌ఐఎమ్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీపై కేసుల పరంపర కొనసాగుతోంది. తన మాటతీరుతో కేసులను కొని తెచ్చుకొంటున్న ఈయనపై సామాజిక వేత్తలు, సామాన్యులు ఫైర్‌ అవుతున్నారు. ఈయన తన మాటలతో మంటలు పెడుతున్నాడని.. తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు కోర్టులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా ఫిర్యాదు చేస్తున్న వారిలో కొంతమంది ముస్లింలు కూడా ఉండటం విశేషం.

అరగంట టైమిస్తే దేశంలోని హిందువులందరినీ నరికి చంపుతామన్న వ్యాఖ్యానాలతో ఒవైసీకి కేసుల తీట మొదలైంది. ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిని అన్న మాట మరిచి ఒవైసీ అలా మాట్లాడాడు. అందుకు సంబంధించి శ్రీకృష్ణజన్మస్థానానికి కూడా వెళ్లొచ్చాడు.

అయితే ఆ తర్వాత కూడా ఒవైసీ తన తీరును మార్చుకోలేదు. కొన్ని ప్రసంగాల్లో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టాడానే ఆరోపణలను ఎదుర్కొన్నాడు. ఈ విషయంపై సామాజిక వేత్తలు కోర్టులకు ఎక్కుతున్నారు. ఒవైసీపై చర్యలు తీసుకోవాలని వారు న్యాయస్థానాలను కోరుతున్నారు.

ఒవైసీ ప్రసంగాల వీడియోలు యూట్యూబ్‌లో ఉన్నాయని.. అవి మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తిస్తాయని, ఒక వర్గం మనోభావాలను దెబ్బతీస్తాయని. ప్రధానమంత్రి నరేంద్రమోడీపై కూడా ఒవైసీ అభ్యంతరకరమైన విమర్శలు చేశాడని అంటూ అజయ్‌ గౌతమ్‌ అనే సామాజిక కార్యకర్త కోర్టులో చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని ఢిల్లీలో కేసు నమోదయ్యింది. ఈ విధంగా ఒవైసీ ఖాతాలో మరో కేసు యాడ్‌ అయ్యింది.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*