జాతీయ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రమేదంటే…

Share this News:

62-national-film-awards62 జాతీయ ఫిలిం అవార్డులు ప్రకటించారు. జాతీయ సినిమాల్లో పాపులర్ సినిమా “మేరీ కోం”  సినిమా నిలవగా, ఉత్తమ చిత్రంగా క్వీన్ నిలిచింది. బెస్ట్ ఫీచర్ ఫిలింగా కోర్ట్ (ఇది నాలుగు భాషల్లో విడుదలైంది) ఎంపికయింది.

ఈ అవార్డుల్లో క్వీన్ సినిమాలో ప్రధాన పాత్రను పోషించిన కంగన రనౌత్ కే ఉత్తమ నటి అవార్డు దక్కడం విశేషం. కన్నడ నటుడు విజయ్ కు ఉత్తమ నటుడు అవార్డు ఆశ్చర్యపరిచింది. మరో అనూహ్యమైన విషయం.. తెలుగులో ప్రవీణ్ సత్తారు తెరకెక్కించి “చందమామ కథలు” సినిమా తెలుగు విభాగంలో ఉత్తమ సినిమాగా ఎంపికైంది.

నిజానికి చందమామ కథలు కమర్షియల్ గా ఫెయిలైనా వినోదాత్మకంగానే ఉంటుంది. ఎనిమిది ఉప కథలతో తయారైన ఒక కథ కావడంతో అది మాస్ ఆడియన్స్ ను మెప్పించలేక చతికిల పడింది. కానీ ఆ సినిమా తీయడం దర్శకుడి ప్రతిభ మాత్రం జాతీయ స్థాయి ప్రశంసలు పొందింది.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*