వరల్డ్ కప్ : ఈసారి ఆ రికార్డు దొబ్బింది

Share this News:
india-world-cupఆస్ట్రేలియాతో సెమీఫైనల్ అనగానే.. టీమ్ఇండియా ఇప్పటిదాకా సాధించిందంతా ఓ ఎత్తు.. ఇప్పుడు సాధించాల్సింది మరో ఎత్తు అన్నారు విశ్లేషకులు. టోర్నీలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి సెమీఫైనల్లో అడుగుపెట్టిన ధోనీసేనకు ఈ మ్యాచ్‌లో అంత ఈజీగా ఉండబోదని అర్థమైంది. ఆ విషయం తొలి ఇన్నింగ్స్ ముగిసేసరికి స్పష్టమైంది.
టోర్నీలో ఇప్పటిదాకా భారత్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థిని ఆలౌట్ చేశారు మన బౌలర్లు. పాకిస్థాన్, దక్షిణాఫ్రికా లాంటి పెద్ద జట్లు కూడా భారత బౌలర్ల ధాటికి ఆలౌట్ కాక తప్పలేదు. జింబాబ్వే జట్టు అందరికంటే బాగా పోరాడినా కూడా ఆలౌట్ కాక తప్పలేదు. 49వ ఓవర్లో ఆ జట్టు ఇన్నింగ్స్ ముగించింది. మరే జట్టుకు కూడా ఇలాంటి రికార్డు లేదు.
న్యూజిలాండ్ వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది కానీ.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆ రికార్డుకు తెరపడింది.  భారత్ మాత్రం క్వార్టర్స్ వరకు ఆలౌట్ రికార్డు రికార్డును కొనసాగించింది. ఐతే ఆస్ట్రేలియా మాత్రం భారత బౌలర్లకు ఛాన్స్ ఇవ్వలేదు. ఆ జట్టు సెమీఫైనల్లో ఏడు వికెట్లే కోల్పోయింది. 50 ఓవర్లు బ్యాటింగ్ చేసిన 328 పరుగులు చేసిందా జట్టు.
ఆలౌట్ చేయడంలోనే కాదు.. పరుగులు కట్టడి చేయడంలోనూ భారత బౌలర్లు గురువారం విఫలమయ్యారు. విధ్వంసక ఓపెనర్ వార్నర్ (12)ను త్వరగా పెవిలియన్ చేర్చగలిగారు కానీ.. మిగతా బ్యాట్స్‌మెన్‌ను ఆపలేకపోయారు. స్మిత్ (105) సెంచరీ చేస్తే.. ఫించ్ 81 పరుగులు కొట్టాడు. మిగతా వాళ్లు కూడా తలో చేయి వేసి.. ఆసీస్‌కు భారీ స్కోరు అందించారు. ఐతే ఓ దశలో 350 ఖాయమనుకున్న స్కోరు 328 పరిమితమవడంలో మాత్రం మన బౌలర్ల ప్రతిభను కొనియాడాలి.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*