వసూళ్లకు వారంరోజులు గడువు

Share this News:

ap

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి నుండి వసూలు చేస్తున్న ప్రవేశ పన్నును వారం రోజుల పాటు నిలిపివేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. విజయవాడ ఎంపీ కేశినేని నానితో కలిసి పలువురు దాఖలు చేసిన పిటీషన్లు ఈ రోజు ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి. ఈ మేరకు పన్ను వసూళ్లను వారం రోజుల పాటు వసూలు చేయొద్దని, చెక్ పోస్టుల వద్ద హామీ పత్రాలు మాత్రం ఇవ్వాలని సూచించింది.

అయితే ఈ నిలిపివేత కోర్టుకు హాజరయిన వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ రోజు కోర్టును ఆశ్రయించిన వారు తప్ప మిగిలిన వారంతా ఖచ్చితంగా ప్రవేశపన్ను చెల్లించాల్సిందేనని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా కేంద్రం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి పన్ను భారం  పడకుండా చూడాల్సిన అవసరం ఉంది.

 

Share this News:

Leave a comment

Your email address will not be published.

*